Table of Contents
show
రాజ్యాంగం – ముఖ్య లక్షణాలు
- 395 ప్రకరణలు 22 భాగాలు మరియు 8 షెడ్యూళ్ళు
- ప్రస్తుతం 470 ప్రకరణలు 25 భాగాలు 12 షెడ్యూళ్ళు
ఒక కొత్త ప్రకరణ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఎలా సూచిస్తారు?
- ఏదైనా ఒక కొత్త ప్రకరణ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆంగ్ల అక్షరాలైన ABCD ల రూపంలో సూచిస్తారు.
- అంతేకానీ వాటికి ప్రత్యేక సంఖ్యను ఇవ్వరు.
- అలాగే తొలగించబడిన ప్రకరణను ఖాళీగా ఉంచుతారు. ప్రకరణల సంఖ్యలో సర్దుబాటు చేయరు.
- ఉదాహరణకు నిబంధన 31 లోని ఆస్తి హక్కును తొలగించారు.
- అయితే ఆ తరువాత నిబంధన 31లో చేర్చిన అంశాలను 31ఆ, 31B, 31C లుగా గుర్తిస్తారు.
- కనుక మౌలిక రాజ్యాంగంలోని నిబంధనల సంఖ్యల వారిగా 395 కు మించదు.
- ఇదే పద్ధతి భాగాలకు కూడా వర్తిస్తుంది.
- అయితే క్రొత్తగా చేసిన ప్రకరణల సంఖ్యను కలుపుకుంటే మొత్తం నిబంధనల సంఖ్య వస్తుంది.
395 – సంఖ్యయుత ప్రకరణలు
470 – మొత్తం ప్రకరణల సంఖ్య
ప్రకరణలు లేదా నిబంధనలు లేదా అధికరణలు అనగా?
- క్రోడీకరించబడిన సమగ్ర సూత్ర నియమాలు. వీటిని ఆంగ్లములో ‘ఆర్టికల్స్’ అంటారు.
భారత రాజ్యాంగం దృడ, అదృడ లక్షణాల సమ్మిలితంగా చెప్పవచ్చు ఎందుకని?
- సాధారణంగా సమాఖ్య వ్యవస్థలకు దృఢ రాజ్యాంగం ఉంటుంది.
- కానీ భారత రాజ్యాంగం దృఢ, అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం.
- రాజ్యాంగ ప్రకరణ 368 ప్రకారం
- కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో,
- మరికొన్ని అంశాలను 2/3 వ వంతు మెజారిటీతో, మిగిలిన అంశాలను 2/3 వంతు మెజారిటీ మరియు రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరిస్తారు.
- కనుక భారత రాజ్యాంగం దృఢ, అదృఢ లక్షణాల సమ్మిళితంగా చెప్పవచ్చు.
- అయితే భారత రాజ్యాంగంలోని ఎక్కువ ప్రకరణలను 2/3 వంతు మెజారిటీతో మాత్రమే సవరించగలరు.
పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనగా?
- భారత రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాలలోనూ “వెస్ట్ మినిస్టర్” తరహా పార్లమెంటు ప్రభుత్వాలను ఏర్పరిచింది.
- కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ నామమాత్ర కార్యనిర్వహణ అధికారులు కాగా, కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం వాస్తవ కార్య నిర్వహణ అధికారాలు ఉంటాయి.
ఏక పౌరసత్వం అనగా?
- భారతదేశంలోని ప్రజలకు ఏక పౌరసత్వం కల్పించడం జరిగింది.
- అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఒకే భారతీయ పౌరసత్వమును కలిగి ఉండడమే కాక వీరి మధ్య ఏ విధమైన వ్యత్యాసం చూపబడదు.
- దీనికి భిన్నంగా అమెరికా, స్విట్జర్లాండ్ లు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించాయి.
- రాష్ట్రాల వారీగా పౌరసత్వాలు ఉంటాయి.