Table of Contents
show
రాజ్యాంగం – ముఖ్య ఆధారాలు
బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
- పార్లమెంటు/ క్యాబినెట్ తరహా పాలనా పద్ధతి
- ద్విసభా పద్ధతి
- సమన్యాయ పాలన
- శాసన నిర్మాణ ప్రక్రియ
- శాసనసభ్యుల స్వాధికారాలు
- స్పీకరు
- డిప్యూటీ స్పీకర్
- కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్
- అటార్నీ జనరల్ మొదలగు పదవులు మరియు రిట్లు జారీ చేసే విధానం.
అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
- ప్రాథమిక హక్కులు
- న్యాయ సమీక్ష
- స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ
- రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం
- ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించడం
- ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు
- రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాలు ఆమోదం తెలపడం
కెనడా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
- గవర్నర్లు నియమించే పద్ధతి
- బలమైన కేంద్ర ప్రభుత్వం
- అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం
- ప్రకరణ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం.
ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఇవి?
- ఆదేశిక సూత్రాలు
- రాష్ట్రపతిని ఎన్నుకునే నైష్పత్తిగా ప్రాతినిధ్యం
- ఒక ఓటు బదిలీ పద్ధతి
- రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం
- న్యాయ సంరక్షణ
- న్యాయ సంరక్షణ లేని హక్కులు
ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
- ఉమ్మడి జాబితా
- పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశము (బిల్లు ఆమోదంలో వివాదం ఏర్పడితే)
- వాణిజ్య, వ్యాపార లావాదేవీలు
- అంతర్రాష్ట్ర వ్యాపారము
- సహకార సమాఖ్య
జర్మనీ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
- జాతీయ అత్యవసర పరిస్థితి
- ప్రాథమిక హక్కులు రద్దు చేసే అధికారం
దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
- రాజ్యాంగ సవరణ విధానం
- రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి
జపాన్ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
నిబంధన 21 లో పేర్కొనబడిన “చట్టం నిర్దేశించిన పద్ధతి”
రష్యా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
- ప్రాథమిక విధులు
- దీర్ఘకాలిక ప్రణాళిక
- సామ్యవాద సూత్రాలు
ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
- గణతంత్ర విధానం
- స్వేచ్ఛ
- సమానత్వం
- సౌబ్రాతృత్వం
- తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం
స్విట్జర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
ప్రధానమంత్రి, మంత్రిమండలి మధ్య సమిష్టి బాధ్యత