భారత ప్రభుత్వ చట్టం – 1935
భారత ప్రభుత్వ చట్టం 1935 లోని ముఖ్యమైన అంశాలు ఏవి ?
- రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు.
- రాష్ట్రస్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు.
- ఓటు హక్కును విస్తృత పరిచారు. జనాభాలో 10 శాతానికి ఓటు హక్కును వర్తింపజేశారు.
- కేంద్ర రాష్ట్రాల మధ్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టును (సుప్రీంకోర్టును) ఏర్పాటు చేశారు.
- ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
- అయితే దీని తీర్పులే సర్వోన్నతం కాదు. వీటిని ఇంగ్లాండ్ లో ఉన్న ప్రీవి (Privy) కౌన్సిల్ కు అప్పీలు చేసుకోవచ్చు.
- ఈ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుండి వేరు చేశారు.
- అలాగే ఒరిస్సా మరియు సింధ్ అనే రెండు కొత్త ప్రొవిన్సు (Province) లను ఏర్పాటు చేశారు.
- కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాలలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు.
- భారతదేశంలో విత్త విధానం మరియు రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (RBI) ఏర్పాటు చేశారు.
- ప్రాంతాల స్వయం ప్రతిపత్తి అనేది ఈ చట్టం ద్వారా పొందుపరచిన అత్యంత ముఖ్యమైన అంశం.
- మొదటిసారిగా రాష్ట్రాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.
- ప్రాంతీయ పరిపాలన అంశాలన్నీ మంత్రుల ఆధీనంలోకి బదిలీ అయ్యాయి.
- కేంద్ర నియంత్రణ చాలా వరకు తగ్గించబడింది.
- గవర్నర్లు రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణింపబడ్డారు.
- భారతీయులకు రాజ్యాంగ రచనలు అనుభవం లేకపోయినా ఈ చట్టం రాజ్యాంగ రచనను సులభతరం చేసిందని చెప్పవచ్చు.
భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ప్రత్యేకత ఏమిటి?
1. బ్రిటిష్ వారు భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన చట్టాల్లో అతిపెద్ద చట్టం.
2. రాజ్యాంగంలోని సుమారు 60 శాతం అంశాలు ఈ చట్టం నుండే గ్రహించారు.
3. ఈ చట్టం ప్రధానంగా స్వయంపాలనకు ఉద్దేశింపబడినది.
4. భారత రాజ్యాంగాన్ని ఈ చట్టం యొక్క నమూనాగా వర్ణిస్తారు. (Photo copy)
5. ఈ చట్టం ద్వారా మొదటిసారిగా కేంద్రంలో సమాఖ్య వ్యవస్థలు, రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ప్రతిపాదించారు.
అట్లీ ప్రకటన అనగా?
- 1948 జూన్ నాటికి బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశం నుంచి వైదొలగుతుందని ప్రకటించారు.
- దీనినే అట్లీ ప్రకటన అంటారు.
- ఈ ప్రకటనను బ్రిటిష్ వారు జారీ చేసిన వాటిలో అత్యుత్తమమైనదిగా మహాత్మా గాంధీ పేర్కొన్నారు.
భారత స్వాతంత్ర చట్టం 1947 లోని ముఖ్యమైన అంశాలు ఏవి?
- భారతదేశ వ్యవహారాల నిర్వహణ నియంత్రణ కోసం రూపొందించిన చిట్టచివరి చట్టం ఇదే.
- బ్రిటన్ ప్రధాని క్లిమెంట్ అట్లీ ఆధ్వర్యంలో భారతీయ గవర్నర్ జనరల్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ సలహా మేరకు 1947 జూలై 4వ తేదీన బ్రిటిష్ పార్లమెంటులో భారత స్వాతంత్ర ముసాయిదాను ప్రవేశపెట్టారు.
- ఈ బిల్లుపై ఆరవ జార్జ్ 1947 జూలై 18 వ తేదీన సంతకం చేశారు.
- ఇది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి (తెల్లవారితే శుక్రవారం) నుండి అమలులోకి వచ్చింది.
1. ఇండియా పాకిస్తాన్ అని రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడతాయి. వీటికోసం వేరువేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
2. లార్డ్ మౌంట్ బార్టన్ మొదటి గవర్నర్ జనరల్ గా నియమించబడ్డాడు.
3. గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగపరమైన అధిపతులుగా వ్యవహరిస్తారు.
4. రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటు గా పనిచేసి చట్టాలను రూపొందిస్తుంది.