Indian Polity

Table of Contents show

రౌండ్ టేబుల్ సమావేశాలు

దీపావళి ప్రకటన అనగా?

 • సైమన్ కమిషన్ నివేదికతో పాటు భారత్లో రాజ్యాంగ సంస్కరణ పై చర్చించేందుకు లండన్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుందని, త్వరలో భారత్ కు స్వతంత్ర ప్రతిపత్తి   కల్పించడం (డొమినియస్ స్టేటస్) తమ అభిమతం అని ఆనాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్  అక్టోబర్ 31, 1929లో ప్రకటించారు. దీనిని దీపావళి ప్రకటన అని అంటారు.

రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడానికి గల కారణం?

 • 1929లో లేబర్ పార్టీ బ్రిటన్ ఎన్నికల్లో గెలుపొందింది.
 • రామ్ సే మెక్ డోనాల్డ్ ప్రధానమంత్రి అయ్యారు.
 • సైమన్ కమిషన్ నివేదికను భారతదేశంలోని రాజకీయ పక్షాలు తిరస్కరించడంతో ఏర్పడిన ప్రతిష్టంబన తొలగించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు.

 మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది?

 • మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్ లో జరిగింది.
 • 89 మంది ప్రముఖ రాజనీతిజ్ఞలు పాల్గొన్నారు.
 • కానీ జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు.

మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లో ఏ అంశం మీద చర్చ జరిగింది?

 • భారత రాజ్యాంగం సమాఖ్యంగా ఉండాలా లేదా ఏక కేంద్రంగా ఉండాలా అనే అంశం మీద చర్చ జరిగింది.

గాంధీ – ఇర్విన్ ఒప్పందం అనగా?

 • కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా రాజ్యాంగ సంస్కరణ పై ఏ సమావేశం నిర్వహించిన ఫలితం ఉండదని బ్రిటిష్ ప్రభుత్వం భావించి త్వరలో జరగబోయే రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీని ఒప్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ ఇర్విన్ ను ఆదేశించింది.
 • శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్ట్ అయిన గాంధీని విడుదల చేయడంతో గాంధీ – ఇర్విన్ మధ్య సమావేశం జరిగింది.
 • దీనిని గాంధీ – ఇర్విన్ ఒప్పందం అని అంటారు

గాంధీ – ఇర్విన్ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏవి?

 • ఇర్విన్ : శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనాలి
 • గాంధీ : రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి,  శాసనోల్లంఘన సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వాలి మొదలగు అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.
 • అయితే భగత్ సింగ్ ఉరిశిక్షను రద్దు చేసే అంశంపై మహాత్మా గాంధీ మాట్లాడనందుకు భారతదేశంలోని యువత కొంత అసంతృప్తికి గురైంది.

రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ తరపున హాజరైన వారు ఎవరు?

 • ఈ సమావేశం 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు లండన్ లో జరిగింది.
 • ఇర్విన్ తో చేసుకున్న ఒడంబడిక ప్రకారం కాంగ్రెస్ తరపున గాంధీజీ సమావేశానికి హాజరయ్యారు.

రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళా ప్రతినిధిగా హాజరైనవారెవరు?

 • ఈ సమావేశానికి మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు హాజరయ్యారు

రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో బలహీన వర్గాల తరఫున హాజరైన వారెవరు?

 • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

రెండవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీజీ వ్యతిరేకించడానికి గల కారణం?

 • ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రోవిన్స్లను (నార్త్ వెస్ట్రన్ ప్రోవిన్స్ మరియు సింద్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం చేత, దీనిని “విభజించు, పాలించు” అనే విధంగా భావించి గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అల్ప సంఖ్యాక వర్గాల సమస్యపై ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.

కమ్యూనల్ అవార్డు అనగా?

 • మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి ఆనాటి బ్రిటన్ ప్రధాని రాంసే మెక్డోనాల్డ్ 1932 ఆగస్టు 4వ తేదీన ఒక ప్రతిపాదన చేశారు. దీనిని కమ్యూనల్ అవార్డు అంటారు.
 • దీని ప్రకారం ముస్లింలకు, సిక్కులకు మరియు క్రిస్టియన్లకు ప్రత్యేక నియోజక గణాలే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక గణాలను ప్రతిపాదించారు.
 • దీనిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమర్ధించారు.
 • అయితే మహాత్మా గాంధీ దీనిని వ్యతిరేకిస్తూ పూనాలోని ఎర్రవాడ కారాగారంలో 1932 సెప్టెంబర్ 20వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.
 • 1932 సెప్టెంబర్ లో పూనా ఒప్పందం కుదిరింది.
 • తద్వారా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు అవకాశాలు లభించాయి.

మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి కొద్దిమందే హాజరవ్వడానికి గల కారణం?

 • సమస్యలు సృష్టిస్తారు అనుకున్న వారికి బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు.
 • అందువల్ల కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశానికి హాజరు కాలేదు. ఇంగ్లాండ్ లోని లేబర్ పార్టీ కూడా సహకరించలేదు.
 • ఇందులో అంతకుముందు నియమించబడిన ఉప సంఘాల నివేదికను చర్చించారు.
 • సమావేశంలో చేసిన సిఫార్సులు ఎక్కువ భాగం 1935 భారత ప్రభుత్వ చట్టంలో స్థానాన్ని పొందాయి.
 • ఈ సమావేశానికి కేవలం 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి?

 • లండన్ లో

మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు ఎవరు?

 • డాక్టర్ మహమ్మద్ అలీ జిన్నా మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్