Indian Polity

సైమన్ కమిషన్ – 1927

సైమన్ కమిషన్ ను భారతీయులు వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటి ?

  • ఈ కమిషన్ లోని సభ్యులందరూ ఆంగ్లేయులు కావడం వల్ల భారతీయులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు.
  • ఈ కమిషన్ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది
  • మొదటగా 1928 ఫిబ్రవరి 3 నుండి మార్చ్ 31 వరకు
  • రెండవ పర్యాయం 1928 అక్టోబర్ 11 నుండి 1929 ఏప్రిల్ 6వ తేదీ వరకు పర్యటించింది.
  • ఈ కమిషన్ తన నివేదికను 1930లో సమర్పించింది.
  • మొదటిసారిగా సమాఖ్యను సూచించినది సైమన్ కమీషన్.

 నెహ్రూ రిపోర్టు లేదా నెహ్రూ నివేదిక లోని ముఖ్యంశాలు ఏమి?

  • భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ 1927 నవంబర్ లో బ్రిటిష్ ఎగువ సభలో మాట్లాడుతూ ‘అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా’ అనే సవాలు విసిరారు.
  • ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928 మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి, రాజ్యాంగ రచనకు మోతిలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో కూడిన ఉప సంఘాన్ని 1928 ఆగస్టు 10వ తేదీన నియమించింది.
  • పండిత్ జవహర్ లాల్ నెహ్రూ దీనికి కార్యదర్శిగా పనిచేశారు.

ముఖ్యాంశాలు:

  • భారతదేశానికి డొమినియం అనగా స్వయం ప్రతిపత్తి ఇవ్వడం.
  • కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖకు బాధ్యత వహించడం
  • 19 ప్రాథమిక హక్కుల ప్రస్తావన
  • అల్ప సంఖ్యాక వర్గాల వారికి శాసనమండళ్ల లో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించడం.
  • భాషా ప్రయుక్త రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు  అనే రెండు అంశాల ఆధారంగా దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం

నోట్: మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించినది నెహ్రూ రిపోర్ట్.