Table of Contents
show
భారత రాజ్యాంగ పరిణామక్రమం
- దేశంలోని పరిపాలన వ్యవస్థలు, వాటి అధికారాలు, విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరుస్తారు.
- ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణం రాజ్యాంగ పాలన.
- రాజ్యాంగ భావనను శాస్త్రీయంగా వివరించిన మొదటి తత్వవేత్త “అరిస్టాటిల్”.
- దేశంలో అన్ని చట్టాలకు రాజ్యాంగమే మూలాధారం.
భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని క్రింది విధంగా పరిశీలించవచ్చు
ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన (1773 – 1857)
- భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార మరియు ఇతర వ్యవహారాలను నిర్వహిస్తూ ఉండేది.
- దీనిని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలను రూపొందించింది. వీటినే చార్టర్ చట్టాలు అంటారు.
- చార్టర్ అనగా ఒక సంస్థకు లేదా సంఘానికి తన కార్యక్రమాలు నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసి అనుమతి పత్రం.
రెగ్యులేటింగ్ చట్టం – 1773
- భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు చేసిన మొట్టమొదటి చట్టం.
- అందుకే దీనిని భారతదేశానికి సంబంధించి “మొట్టమొదటి లిఖిత చట్టం”గా పేర్కొంటారు.
- ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడం కోసం గా ఏర్పాటు చేసినటువంటి చట్టం కాబట్టి దీనిని రెగ్యులేటింగ్ చట్టం అంటారు.
- బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను “గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్” గా మార్చారు. ఆ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ గా నియమించబడినది వారన్ హేస్టింగ్స్.
- 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో కలకత్తాలోని పోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
- మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే.
పిట్స్ ఇండియా చట్టం – 1784
- రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని 1784 లో ఆమోదించింది.
- అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి “విలియం పిట్” ఈ చట్టాన్ని ప్రతిపాదించడం వలన దీనిని పిట్స్ ఇండియా చట్టంగా వ్యవహరిస్తారు.
- ఈస్ట్ ఇండియా కంపెనీ విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా వేరు చేశారు.
- ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను “బోర్డ్ ఆఫ్ కంట్రోల్” కి అప్పగించారు.
- అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను “కోర్ట్ అఫ్ డైరెక్టర్స్” కు పరిమితం చేశారు.
- ఈ చట్టాన్ని భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినదిగా “మార్క్స్ మరియు ఎంగిల్స్” అభివర్ణించారు.
చార్టర్ చట్టం – 1793
- ఈస్ట్ ఇండియా కంపెనీకి గల వ్యాపార గుత్తాధిపత్యం మరొక 20 సంవత్సరాలు పొడిగించబడింది.
- బోర్డు కార్యదర్శిని పార్లమెంటులో కూర్చోవడానికి అనుమతించారు.
చార్టర్ చట్టం 1813
- ఈస్ట్ ఇండియా కంపెనీ చార్టర్ను మరొక 20 సంవత్సరాలు పొడిగించారు.
- పన్నులు విధించడానికి అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.
- భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం లక్ష రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు.
- ఈ చట్టం ద్వారా భారత్ లో వర్ధకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించారు.
- భారత్ లో మిషనరీలు ప్రవేశించి చర్చిలు, హాస్పిటల్స్, విద్యాలయాలు స్థాపించడం వలన మతమార్పిడులకు అవకాశం ఏర్పడింది.
చార్టర్ చట్టం 1833
- ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మరొక 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది.
- ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను “ఇండియన్ గవర్నర్ జనరల్“గా మార్చారు. ఆ హోదాలో మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్.
- భారతీయ శాసనాలు క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమీషన్ ను నియమించారు.
- భారతీయ లా కమిషన్ కు మొట్టమొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
చార్టర్ చట్టం 1853
- చార్టర్ చట్టాల్లో ఇది చిట్ట చివరి చట్టం.
- సివిల్ సర్వీసు నియామకాలను “సార్వజనిక పోటీ విధానం” (Open Merit) ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇందుకోసం లార్డ్ మెకాలే కమిటీని 1854లో ఏర్పాటు చేశారు.
- వివిధ “లా కమిషన్ల” సిఫార్సుల ద్వారా
సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859)
ఇండియన్ పీనల్ కోడ్ (1860) మరియు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లను (1861) రూపొందించడం జరిగింది.
- అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఇదే.