Table of Contents
show
1. మన భారతదేశానికి యూరోపియన్ల రాక ఎలా ప్రారంభమైంది?
- ప్రాచీన కాలంలో భారత దేశంలో తయారయ్యే వస్తువులకు యూరప్ లో గొప్ప డిమాండ్ ఉండేది.
- మొగులుల పరిపాలన కాలంలో యూరోపియన్లు అసంఖ్యాకంగా వ్యాపార కార్యకలాపాల కోసం భారతదేశానికి వచ్చేవారు.
- భారతదేశం నుండి యూరోపియన్ దేశాలకు సుగంధ ద్రవ్యాలు మాస్లిన్ వస్త్రాలు ఎగుమతి అయ్యేవి.
- భారతదేశంలో తయారు అయ్యే వస్తువులకు యూరోప్ దేశాలకు సముద్రమార్గం ద్వారా ఎగుమతి చేసేవారు.
2. సముద్ర మార్గం ద్వారా ప్రధమంగా వ్యాపారం చేపట్టిన వారు ఎవరు?
- అరబ్బులు. అరబ్బుల వర్తకానికి ప్రధాన స్థావరం కాంస్టాంటనోపుల్.
3. భారతదేశానికి సముద్రమార్గమును కనుగొనుటకు యూరోపియన్లు ప్రయత్నించడానికి గల కారణం?
- 1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్ కాంస్టాంటనోపుల్ ను ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంతో లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించాడు.
- దీనితో భారతదేశంతో నేరుగా ఒక సముద్రం మార్గమును కనుగొనుటకు యూరోపియన్లు నిర్ణయించారు.
4. యూరప్ లో సముద్రయాణమును ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?
- “హెన్రీ” (పోర్చుగల్ రాజు)
- ఇతనికి ‘ది నావిగేటర్’ అనే బిరుదు ఇవ్వబడినది.
5. దక్షిణాఫ్రికా ఆగ్రాన్ని కనుగొని దానికి తుఫానుల ఆగ్రమ్ అని పేరు పెట్టినది ఎవరు?
- భర్తలోమ్యూడజ్
6. తుఫానుల ఆగ్రంనకు ‘కేఫ్ ఆఫ్ గుడ్ హోప్’ అని పేరు పెట్టిన వారెవరు?
- రెండవ జాన్ (పోర్చుగల్ రాజు)
7. వాస్కోడిగామా పోర్చుగల్ రాజు 2వ ఇమ్మానుయేల్ ప్రోత్సాహంతో ఏ ఓడరేవు నుంచి భారతదేశానికి బయలుదేరాడు?
- లిస్ బన్ ఓడరేవు
- వాస్కోడిగామా భారతదేశంతో సముద్ర మార్గం కనుగొనుటకు 1497లో బయలుదేరి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ కు చేరుకున్నాడు
- వాస్కోడిగామా అబ్దుల్ మజీద్ అనే వర్తకుడిని కలిసి అతని సహాయంతో 1498 మే 17న కాలికట్ (ప్రస్తుతం కోజికోడ్) చేరుకున్నాడు.
8. వాస్కోడిగామా ప్రయాణించిన నౌక పేరు?
- సౌత్ గాబ్రియల్
9. వాస్కోడిగామా భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి రాజవంశాలు ఏవి?
- కాలికట్రాజు – జామోరిన్ లేదా రాజా మను విక్రమ వర్మ
- విజయనగర పాలకుడు – ఇమ్మడి నరసింహ రాయలు
- ఢిల్లీ సుల్తాన్ – సికిందర్ షా (లోడీ వంశం)
10. యూరప్ వారు భారత్ కు వచ్చిన వరుస క్రమం
1. పోర్చుగీసు
2. డచ్
3. బ్రిటిష్
4. డేన్స్
5. ఫ్రెంచ్
11. యూరోపియన్లు ఆంధ్రకు వచ్చిన వరుస క్రమం
1. డచ్
2. బ్రిటిష్
3. ఫ్రెంచ్
4. పోర్చుగీస్
12. భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలను స్థాపించిన ఐరోపా దేశం ఏది?
- పోర్చుగల్
- క్రీ. శ 1500 ‘ ఎస్టోడ డ ఇండియా’ (Estoda-da-India) అనే పోర్చుగీసు కంపెనీ భారత దేశంలో వ్యాపారం చేయడానికి స్థాపించబడింది.
- వీరు వ్యాపారం కోసం భారతదేశానికి మిగతా యూరోపియన్ల కంటే మొదటగా వచ్చి అందరికంటే చివరగా భారతదేశాన్ని వదిలి వెళ్లారు.
13. పోర్చుగీసు వారు భారత్ లో ప్రధమంగా ఏర్పరచిన వర్తక స్థావరం?
- కొచ్చిన్
14. భారతదేశంలో పోర్చుగీసు వారి రెండవ స్థావరం?
- భారత్ లో పోర్చుగీసు వారి పాలనా కేంద్రం గోవా.
- పోర్చుగీసు వారి రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చినది నినాడోచున్హా.
15. పోర్చుగీసు వారి మొట్ట మొదటి గవర్నర్ ఎవరు?
- ఫ్రాన్సిస్-డి-అల్మిడా
- ఇతను నీలి నీటి విధానంను ప్రవేశపెట్టాడు.
16. నీలి నీటి విధానం (బ్లూ వాటర్ పాలసీ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
- సముద్రంపై గుత్తాధిపత్యం కలిగి ఉండుట.
- ఈ విధానం ప్రకారము పోర్చుగీసు వారు భారతదేశం యొక్క పాలన వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా అరేబియా సముద్ర ప్రవర్తకంపై గుత్తాధిపత్యం సాధించుటకు ప్రయత్నించారు.
17. భారతదేశంలో పోర్చుగీసు వారి రాజ్య నిర్మాత ఎవరు?
- అల్ఫన్సోడి అల్బుకర్క్
- ఇతను పోర్చుగీసు అధికారులలో గొప్పవాడు.
- ఇతను నీలి నీటి విధానాన్ని రద్దు చేశాడు.
- ఇతను పోర్చుగీసువారికి భారతీయులతో వివాహ సంబంధాలను ప్రోత్సహించాడు.
18. పోర్చుగీసు అధికార యంత్రాంగానికి కేంద్ర స్థానం ఏది?
- గోవా
19. అల్ఫన్సోడి అల్బుకర్క్ కు సమకాలిన విజయనగర రాజు ఎవరు?
- శ్రీకృష్ణదేవరాయలు
- శ్రీకృష్ణదేవరాయలతో గోవా సంది చేసుకొని బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్షాను ఓడించి గోవాను ఆక్రమించాడు. బీజాపూర్ నుండి గోవాను ఆక్రమించాడు.
20. గుజరాత్ పాలకుడు అయినా బహదూర్ష మరియు చున్హా కు మధ్య ఏ ప్రాంత ఆధీనమునకు సంబంధించి వివాదం ఏర్పడినది?
- డయ్యు ప్రాంత ఆధీనమునకు సంబంధించి వివాదం ఏర్పడినది. దీని కారణముగా చున్హా బహదూర్షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు.
21. గోవాకు వచ్చిన ప్రథమ క్రైస్తవ మత ప్రచారకుడు ఎవరు?
- సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్.
- ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ఉన్న ప్రదేశం గోవా.