Daily Current Affairs

September – 2022

నాగాలాండ్ లో తొలిసారిగా నాగా మిర్చా ఫెస్టివల్

 • నాగాలాండ్‌ రాజధాని కొహిమాపరిధిలోని, సెయిహమాగ్రామం లో తొలిసారిగా నాగా మిర్చా (నాగా కిం గ్ చిల్లీ) ఫెస్టివల్ నిర్వహించారు.
 • ఈ ఉత్స వాలు నాగాలాండ్ హార్టికల్చర్ డిపార్టుమెంటు కనుసన్నలలో నిర్వహించబాయి.
 • నాగా మిర్చా అనేది నాగాలాండ్‌కు చెందిన ఒకరకమైన మిరప జాతి.
 • నాగాలాండ్ నుండి మొదటి జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తిగా నాగా మిర్చా గుర్తింపు పొందింది.

ఒడిశా వ్యవసాయ పండుగ నుఖాయ్‘ 2022

 • ఒడిషాలో నుఖాయ్ వార్షిక పంట పండుగను ఘనంగా జరుపుకున్నారు.
 • ఇది పశ్చిమ ఒడిశా మరియు సిమ్‌డేగాలోని పొరుగు ప్రాంతాలలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి.
 • గణేష్ చతుర్థి పండుగ మరుసటి రోజు దీనిని జరుపుకుంటారు.
 • ఈ సంధర్బంగా రైతులు కొత్త వ్యవసాయ ఏడాదికి ఆహ్వానం పలుకుతూ, మంచి వర్షాలు, వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కోసం ఆకాంక్షిస్తూ భూమిమాతను పూజిస్తారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు

 • తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది రోజుల అధికారిక బతుకమ్మ ఉత్సవాలు 25 సెప్టెంబర్ 2022న ఘనంగా ప్రారంభమైయ్యాయి.
 • బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రం లో మరియు ఆం ధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా జరుపుకునే సంప్రాదయ అమ్మవారి పండుగ.
 • 24 జూన్, 2014 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “బతుకమ్మ పండుగ”ని టి స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించింది.
 • ప్రతి సంవత్సరం ఈ పండుగను శాతవాహన క్యాలెండర్ ప్రకారం పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు, సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్-అక్టోబర్‌లో దుర్గా నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ జరుపుకుంటారు.
 • తొమ్మిది రోజుల ఈ వార్షిక ఉత్సవాల్లో, ప్రత్యేకంగా అమర్చిన పూల చుట్టూ మహిళలు మరియు బాలికలు బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యం చేస్తారు.
 • పండుగ ముగిశాక స్థానిక చెరువుల్లో పూలమాలలు వేసి నిమజ్జనం చేస్తారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై ఐదేళ్ల నిషేధం

 • దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పు పొంచి ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) మరియు దాని అనుబంధ సంస్థలపై కేంద్రం ఐదేళ్లపాటు నిషేధం విధించింది.
 • పీఎఫ్‌ఐ మరియు దాని అనుబంధ ఫ్రంట్‌లు దేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, ఇవి దేశ సమగ్రత, సార్వభౌమాధికారం మరియు భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని మరియ దేశంలోని ప్రజాశాంతి మరియు మత సామరస్యానికి భంగం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నోటిఫికేషన్ పేర్కొంది.
 • చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం , 1967(37 ఆఫ్ 1967)లోని సెక్షన్ 3లోని సబ్-సెక్షన్ (1) ద్వారా నిషేధం అమలు చేసారు.

గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ ఆవిష్కరణ

 • కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్, 26 సెప్టెంబర్ 2022 న ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో తన కొత్త పార్టీని జమ్మూ కాశ్మీరులో ప్రారంభించారు.
 • ఇటీవలే వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యం లో కాంగ్రెస్ నుండి నిష్క్రమించిన అజాజ్, 2014 నుండి 2021 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
 • అలానే 2005 నుండి 2008 వరకు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

G20 సమ్మిట్ 2023 కి భారత్ ఆతిథ్యం

 • వచ్చే ఏడాది సెప్టెంబరు 9 మరియు 10వ తేదీల్లో జరిగే G20 లీడర్స్ సమ్మిట్‌ 2023 కి భారతదేశ రాజధాని న్యూఢిల్లీ ఆతిధ్యం ఇవ్వనుంది.
 • అదే సమయంలో భారతదేశం ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు ఒక సంవత్సరం పాటు G20 అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం దక్కించుకుంది.
 • అదే సమయంలో ఈ సమావేశంలో అతిధి దేశాలుగా పాల్గునేందుకు బాంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, నెథర్లాండ్, నైజీరియా, ఒమాన్, సింగపూర్, స్పెయిన్ మరియు యూఏఈ దేశాలను భారత్ ఆహ్వానిస్తుంది.
 • G20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్.
 • ఈ కూటమిలో ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్ , జర్మ నీ, భారతదేశం , ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, రష్యా , సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూకే ,యూఎస్ మరియు యూరోపియన్యూనియన్‌తో సహా 19 దేశాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన

 • బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల భారత్ పర్యటన నిమిత్తం ఆగష్టు 2న న్యూఢిల్లీ చేరుకున్నారు.
 • ఆమె పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక సంప్రదింపులు జరుపనున్నారు.
 • ఇదే సమయంలో విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకరుతో పాటుగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్‌లను కలవనున్నారు.
 • షేక్ హసీనా చివరిసారిగా అక్టోబర్ 2019లో భారత్ సందర్శించారు. ఇటీవలి సంవత్సరాలలో ఇరు దేశాల మధ్య అత్యుత్తమ సంబంధాలు కొనసాగుతున్నాయి.

దేశంలో అతిపెద్ద రబ్బరు డ్యాం ప్రారంభం

 • గయాలోని ఫల్గు నదిపై భారతదేశంలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ ‘గయాజీ డ్యామ్’ను ప్రారంభించారు.
 • 411 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ డ్యామ్ నిర్మాణానికి దాదాపు 312 కోట్లు ఖర్చు చేసారు.
 • హిందువులు మరియు బౌద్ధమతాల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గయాలో నిర్మించబడిన ఈ రబ్బరు డ్యామ్, పితృపక్ష మేళా సందర్భంగా తమపూర్వీకుల పిండదానం మరియు తర్పణం చేయడానికి వచ్చే ప్రజలకు సౌకర్యార్థంగా ఉండనుంది.

హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ప్రారంభించిన అమిత్ షా

 • హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏడాదిపాటు జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా 17 సెప్టెంబరు 2022న ప్రారంభించారు.
 • జాతీయ జెండాలను ఎగురవేసి పారామిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
 • ఇక మీదట 17 సెప్టెంబరును హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోనున్నారు.
 • ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక రవాణాశాఖ మంత్రి శ్రీరాములు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
 • ఈ సందర్భంగా హైదరాబాద్‌ విముక్తి కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు అధికారికంగా నివాళు అర్పించారు.
 • సెప్టెంబర్ 17, 1948లో జరిగిన ఆపరేషన్ పోలో తర్వాత అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్ కాల్పుల విరమణ ప్రకటించడం ద్వారా, బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్రం పొందిన 13 నెలల తర్వాత హైదరాబాద్‌ను ఇండియన్యూనియన్‌లో చేర్చడానికి మార్గం సుగమం అయ్యింది.

అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్ ప్రారంభం

 • లెజెండరీ సింగర్ లతామంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా అయోధ్యలో లతామంగేష్కర్ చౌక్‌ను 28 సెప్టెంబర్ 2022 న ఉత్తరప్రదేశ్ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు.
 • కూడలిలో లతామంగేష్కర్ గౌరవార్దంగా 14 టన్ను ల బరువున్న 40 అడుగుల పొడవు మరియు 12 మీటర్ల ఎత్తున్న వీణను ఏర్పాటు చేశారు.