Daily Current Affairs

December – 2022

ఇండియన్ అఫైర్స్

ఢిల్లీ లో ఇండియా – సెంట్రల్ ఆసియా సమావేశం

 • నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క ఇండియా – సెంట్రల్ ఆసియా మీటింగును మొదటిసారి న్యూఢిల్లీలో నిర్వహించారు.
 • ఈ సమావేశానికి జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు.
 • మధ్య ఆసియా దేశాలతో ఇండియా కనెక్టివిటీని పెంపొందించేందుకు, టెర్రర్ ఫైనాన్సింగ్, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై చర్చలు జరిపారు.
 • మధ్య ఆసియా దేశాల నుండి అత్యున్నత భద్రత అధికారులతో కూడిన ఈ సమ్మేళనాన్ని భారతదేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. 

డిసెంబర్ నుంచి జి20 అధ్యక్ష హోదాలో భారత్

 • భారతదేశం అధికారికంగా ఒక సంవత్సరం పాటు G20 అధ్యక్ష పదవిని చేపట్టింది.
 • 1 డిసెంబర్ 2022 నుండి నవంబర్ 20, 2023 వరకు ఒక సంవత్సరంపాటు ఈ హోదాను కలిగి ఉండటంతో పాటుగా వివిధ సమావేశాలకు ఆతిథ్యమివ్వనుంది.
 • ఈ సందర్భంగా జి-20 లోగోతో పాటుగా 100 స్మారక చిహ్నాలను విడుదల చేశారు.
 • వన్ ఎర్త్, వన్ ఫామిలీ, వన్ఫ్యూ చర్ థీమ్’తో ఈ ఏడాది పొడుగునా 32 విభిన్న రంగాల్లో 20 పైగా మీటింగు నిర్వహించనున్నారు.
 • వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 మరియు10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ20 లీడర్స్ సమ్మిట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశాల్లో జీ20 దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతలు పాల్గొంటారు.
 • జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్.
 • ఇందులో ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్ , జర్మనీ, భారతదేశం , ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, రష్యా , సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా,యూకే, యూఎస్ఏ మరియు యూరోపియన్ యూనియన్ తో సహా 19 దేశాలు భాగస్వామ్యదేశాలుగా ఉన్నాయి.

నాగాలాండ్ లో 23వ హార్న్ బిల్ ఫెస్టివల్ ప్రారంభం

 • నాగాలాండ్ హార్న్ బిల్ ఫెస్టివల్ 2022 యొక్క 23వ ఎడిషన్ నాగ హెరిటేజ్ విలేజ్ కిసామాలో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు నిర్వహిస్తున్నారు.
 • ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ ఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 • ఆ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద దేశీయ పండుగలో ఇది ఒకటి. 

ఐఐటి మద్రాస్ పరిశోధకుల ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్

 • ఐఐటి మద్రాస్ పరిశోధకులు, సముద్ర అలల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయగల ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ ని అభివృద్ధి చేశారు.
 • దీనికి సంబంధించిన మొదటి దశ ప్రయోగం డిసెంబర్ 7న విజయవంతంగా పూర్తి చేశారు.
 • ఈ పరికరానికి సింధూజ-1 అని నామకరణం చేశారు.
 • ఈ యంత్రం ద్వారా వచ్చే మూడేళ్ల కాలంలో ఒక మిలియన్ వాట్ల  విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

చెన్నైలో మొదటి డ్రోన్ స్కిల్ ట్రైనింగ్ కాన్ఫరెన్స్

 • కేంద్రం మంత్రి అనురాగ్ ఠాగూర్ డిసెంబర్ 6న చెన్నైలో భారత దేశపు మొట్టమొదటి డ్రోన్స్ స్కిల్ ట్రైనింగ్ కాన్ఫరెన్స్ ప్రారంభించారు.
 • ఇదే వేదిక ద్వారా భారత దేశంలోని 777 జిల్లాల పరిధిలో వివిధ వ్యవసాయ అవసరాల కోసం రోడ్ల సామర్థ్యాన్ని బోధించే మరియు ప్రదర్శించే గరుడ ఏరోస్పేస్ డ్రోన్ యాత్ర ‘ఆపరేషన్ 777’ ని కూడా ఏకకాలంలో ఫ్లాగ్ చేశారు.
 • గరుడ యొక్క దేశవ్యాప్త డ్రోన్ యాత్ర ద్వారా రైతులకు గరుడ యొక్క కిసాన్ డ్రోన్ల ఉపయోగం మరియు వాటి ప్రయోజనాలతో పాటు వాటి యొక్క విశేషాలను పరిచయం చేయనున్నారు.
 • అదే సమయంలో వచ్చే ఏడాదిలోపు 25,000 మేడ్ ఇన్ ఇండియా కిసాన్ డ్రోన్లను  అందుబాటులోకి తీసుకురానున్నారు.